‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్.. మాస్ కా దాస్ విశ్వక్ కాంబోలో వస్తున్న మూవీ ఫంకీ. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీలో నటించాలనుకున్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఫంకీ మూవీలో నటించడానికి సరికొత్త టాలెంట్, సరికొత్త నటీ, నటులు కావాలని ప్రకనట విడుదల చేశారు. అనుదీప్ క్యాస్టింగ్ కాల్లో ఉన్న వివరాలు చూస్తే.. " నటించాలనుకున్న వారి జెండర్తో, వయస్సుతో సంబంధం లేదు. మాకు కేవలం మీలోని ప్యాషన్ మాత్రమే కావాలి. మీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్, అలాగే మీలో ఉన్న ధైర్యమే మీరు చేసే క్యారెక్టర్కి కావాలని" తెలిపారు.
ఇక ఆలస్యం ఎందుకు అనుదీప్ నవ్వుల ప్రయాణంలో పాలుపంచుకోవడానికి సిద్ధం అవ్వండి. ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే ఈ పోస్టర్లో ఉన్న నంబర్ కి మీ వివరాలు పంపండి.ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆషిక రంగనాధ్ నటించనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఎడిటర్ నవిన్ నూలి.
Also Read :- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త ప్రయోగం.. కన్నడ స్టార్ హీరోతో సినిమా అనౌన్స్
మాస్ హీరో విశ్వక్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆయన గత చిత్రం గామి కూడా సీరియస్ సినిమా కావడంతో విశ్వక్ కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలనీ చేస్తున్నాడట. ఇటీవలే మెకానిక్ రాఖీతో కామెడీ సైబర్ థ్రిల్లర్ తో వచ్చి పర్వాలేదనిపించారు. ఇందులో భాగంగానే దర్శకుడు అనుదీప్ తో అదిరిపోయే ఎంటర్ టైనర్ తో వస్తున్నాడట.
? CASTING CALL for #FUNKY ?
— Sithara Entertainments (@SitharaEnts) December 17, 2024
No age or gender limits!
We are looking for passionate individuals who love acting. If you’ve got the talent, we want to see it! ✨
Send your portfolio ~ ? anudeepteam@gmail.com
Mass Ka Das @VishwakSenActor @anudeepfilm @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/RTkaim1Hdj