ఇలా విడిపోవచ్చు : వేలంటైన్స్ డే మాత్రమే కాదు.. బ్రేకప్ వీక్ మొదలైంది

వాలంటైన్స్ డే వీక్ నిన్నటి వరకు నడిచింది.. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినం జరుపుకున్నారు.. ఇప్పుడు బ్రేకప్ వారం మొదలైంది.. అదేంటీ అనుకుంటున్నారా అదే విచిత్రం.. ప్రేమికుల దినోత్సవాన్ని రోజుకో రకంగా వారంపాటు ఎలా జరుపుకుంటారు.. బ్రేకప్ వీక్ ను ఫిబ్రవరి 21వ తేదీ వరకు రోజుకో రకంగా జరుపుకుంటారు. ఈ వారం తమ ప్రేమకు బ్రేకప్ చెప్పటానికి రోజుకో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.. అదేంట్రా నిన్నటి వరకు హ్యాపీగా చెప్పి.. ఇప్పుడు విదాషానికి వారం ఏంట్రా అంటారా.. అదే మరి పాశ్చాత్య సంస్కృతి అంటే.. విదేశీ కల్చర్ అంటే.. ఫిబ్రవరి 15వ తేదీతో మొదలయ్యే ఈ వారంలో ఏ రోజు ఏంటో తెలుసుకుందామా..

స్లాప్ డే (ఫిబ్రవరి 15)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ను ప్రారంభించడం అనేది స్లాప్ డేతో మొదలవుతుంది. తమను మోసం చేసిన, హృదయాన్ని గాయపరిచిన ఎక్స్‌లవర్స్‌ను చెంప దెబ్బ కొట్టాలనుకునే వ్యక్తుల కోసం ఈ రోజు డిజైన్ చేయబడింది. మీరు నిజంగా వెళ్లి వారిని చెంపదెబ్బ కొట్టాలనేది దీని ఉద్దేశ్యం కాదు. బదులుగా మీ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉంటూ.. మాజీ లవర్‌తో ఉన్న జ్ఞాపక అవశేషాలను చెరిపేస్తూ, జీవితంలో ముందుకు సాగండి.

కిక్ డే (ఫిబ్రవరి 16)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ లో రెండో రోజు కిక్ డే. ప్రేమికులు తమ జీవితాల నుండి ప్రతికూలత, విషపూరితతను తొలగించమని ప్రోత్సహిస్తుంది. ఇది గత మనోవేదనలను సూచిస్తూ వాటన్నిటిని కిక్ చేయడాన్ని సూచిస్తుంది.  

పెర్ఫ్యూమ్ డే (ఫిబ్రవరి 17)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ లో మూడో రోజు పెర్ఫ్యూమ్  డే. స్వచ్ఛమైన గాలిని వదిలి పెర్ఫ్యూమ్ అంటూ కొన్ని ద్రవాలను శరీరం పై చల్లుకోవడంతో సువాసన మాత్రమే వస్తుంది. కానీ మనిషి జీవనాడిలోని వ్యక్తిత్వం కోల్పోతారు. ఈ క్రమంలోనే ఒకరి వ్యక్తిత్వాన్ని తిరిగి పొందడం కోసం స్వచ్ఛమైన గాలిలాంటి తమ జీవితాన్ని తిరగి పొందడం కోసం పెర్ఫ్యూమ్ డేను జరుపుకుంటారు.

ఫ్లర్టింగ్ డే (ఫిబ్రవరి 18)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ లో నాలుగో రోజు ఫ్లర్టింగ్ డే. ఫ్లర్టింగ్ డే అనేది శృంగార అంశం గురించి కాదు. ప్రేమలో ఉన్నప్పుడ వారు  పొందిన ఆనందాలను గుర్తు చేసుకోవడం కోసం ఫ్లర్టింగ్ డేను జరుపుకుంటారు. 

కన్ఫెషన్ డే (ఫిబ్రవరి 19)

యాంటీ వాలెంటైన్ వీక్‌లో ఐదో రోజున కన్ఫెషన్ డే. ప్రేమలో ఉన్నవారు ఇప్పటి వరకు వారి రిలేషన్‌షిప్‌లో పడిన కష్టాలను ఈరోజున పూర్తిగా మరిచిపోవాలి. మీ తప్పులను ఒప్పుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించండి.

మిస్సింగ్ డే (ఫిబ్రవరి 20)

యాంటీ వాలెంటైన్ వీక్‌లో ఆరో రోజును మిస్సింగ్ డే. ప్రేమించిన వ్యక్తితో గడిపిన అద్భుతమైన క్షణాలను మిస్ రిమైండ్ చేస్తూ వారిని అవుతుంటాము. వారి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాము.
 
బ్రేకప్ డే (ఫిబ్రవరి 21)

 యాంటీ-వాలెంటైన్స్ వీక్ లో చివరి రోజు బ్రేకప్ డే. ఇప్పటి వరకు మీరు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమ నిజమైనది కాదని భావిస్తే వారికి తమ జీవితంలో చోటు లేదని చెప్పడం కోసం బ్రేక్ అప్ డేను సెలబ్రేట్ చేస్తుంటారు.