ఆటో ప్రమాద ఘటనలో మరో టీచర్ మృతి

సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీ సమీపంలో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ఈనెల 4న లారీని ఆటో డీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలతోపాటు ఓ చిన్నారి మృతి చెందింది. బాలెంల సాంఘిక సంక్షేమ పాఠశాలలో టీచర్​గా పనిచేస్తున్న లావణ్య విధులు ముగించుకొని సూర్యాపేట వచ్చేందుకు ఆటో ఎక్కింది. ప్రమాదవశాత్తు ఈ ఆటో లారీని ఢీకొట్టింది. 

ఈ ఘటనలో ఒక టీచర్ మృతి చెందగా మరో టీచర్​ లావణ్యకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ దవాఖానకు​ తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. దవాఖానలో చికిత్స పొందుతూ లావణ్య(26) ఆదివారం మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.