మరో క్షిపణి ప్రయోగం విజయవంతం

భువనేశ్వర్: ఇండియన్ నేవీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో) ఉమ్మడిగా చేపట్టిన వీఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఎమ్ (వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్) పరీక్ష విజయవంతమైంది. శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి ఈ మిస్సైల్ టెస్ట్ నిర్వహించారు. ఇప్పటికే గురువారం నిర్వహించిన టెస్ట్ విజయవంతం కాగా.. తాజాగా చేపట్టిన రెండవ పరీక్ష కూడా విజయవంతమవడంతో డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో, నేవీ అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది.

 ఈ మిస్సైల్స్ సముద్ర ఉపరితలంపై చాలా తక్కువ ఎత్తులో అధిక వేగంతో పయనిస్తున్న వైమానిక లక్ష్యాన్ని, అత్యంత కచ్చితత్వంతో విజయవంతంగా ఛేదిస్తాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. వరుసగా రెండ్రోజుల్లో రెండు క్షిపణులను విజయవంతంగా పరీక్షించడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగాల్లో  పాల్గొన్న డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో, నేవీ బృందాలు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.