జమ్మూకాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని కుప్వారా జిల్లాలో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‎లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇండియన్ ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. టెర్రరిస్టులు చొరబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి జమ్మూకాశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. 

ఈ క్రమంలో ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ లాంచ్ చేశారు. కుప్వారా, మచల్ ప్రాంతాల్లో ఆగస్టు 28–29 మధ్య రాత్రి చొరబాటుదార్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అనుమానాస్పదంగా కనిపించడంతో కాల్పులు జరిపి ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. కుప్వారాలోని తంగ్ ధర్‎లో చొరబడేందుకు ప్రయత్నించిన మరొక టెర్రరిస్టును కాల్చివేశారు.