- యూఏఈ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో గుర్తింపు
న్యూఢిల్లీ: ఇండియాలో మరో ఎంపాక్స్ కేసు నమోదైంది. గత నెలలో డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకు కారణమైన ‘క్లేడ్ 1బీ’ రకాన్ని ఇండియాలో గుర్తించారు.
ఇటీవల యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏండ్ల వ్యక్తికి ‘క్లేడ్ 1బీ’వేరియంట్ సోకిందని అధికారులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అంతకుముందు హర్యానాలోని హిసార్‌కు చెందిన 26 ఏండ్ల వ్యక్తికి ఎంపాక్స్ క్లేడ్ 2 రకాన్ని గుర్తించారు.
ఈ రకమైన వేరియంట్ తొలుత ఆఫ్రికాలో బయటపడింది.