కొత్త బియ్యం వల్లే ఇబ్బందులు : ఆర్సీవో అంజలి

తిమ్మాపూర్, వెలుగు : తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు కొత్తబియ్యం పంపిణీ చేశారని, ఆ బియ్యం వల్లే అన్నం ఉడకక విద్యార్థులు తినడానికి ఇబ్బంది పడ్డారని ఆర్సీవో అంజలి తెలిపారు. పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు మంగళవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

దీంతో బుధవారం ఆర్సీవో గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొత్త బియ్యం పంపిణీ చేయడంతో అన్నం ముద్దలుగా మారి తినేందుకు ఇబ్బంది కలిగినట్లు గుర్తించామన్నారు. విద్యార్థులు పలు సమస్యలు విన్నవించగా వాటి పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.