సెనేట్‎లోకి తొలి కొరియన్ అమెరికన్ ​ఆండీ కిమ్

వాషింగ్టన్: న్యూజెర్సీ సెనేటర్‎గా కొరియన్ అమెరికన్ ఆండీ కిమ్ గెలుపొందాడు. చట్టసభకు ఎన్నికైన తొలి ఆసియన్ అమెరికన్‎గా ఆండీ కిమ్ రికార్డు సృష్టించారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆండీకి.. 20.29 లక్షల ఓట్లు పోలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ప్రముఖ వ్యాపారవేత్త కర్టిస్ బాషాకు 17.03 లక్షల ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ ‘‘కొరియన్ అమెరికన్లు పడుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. గతంలో ఎన్నో పోరాటాలు చేశాను. అదే కొనసాగిస్తా. నా విజయం ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచింది’’ అని కిమ్ తెలిపాడు.