అనంత్ అంబానీ పెళ్లిలో..కరీంనగర్ ఫిలిగ్రీ గిఫ్ట్స్!

  •  400 రకాల వస్తువుల ఆర్డర్

  •  నగల పెట్టెలు, ట్రేలు, పండ్ల గిన్నెలు..

  •  ఇటలీ, స్విట్జర్ లాండ్ దేశాల్లో వేడుకలు

  •   ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు 

 అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం.. భారీ క్రూయిజ్‌ షిప్‌లో జూలైలో జరగనున్న విషయం తెలిసిందే. రెండు దేశాల్లో ఈ పెళ్లి చేసేందుకు అంబానీ ప్లాన్ చేశారు. మొదట మే 29వ తేదీన ఇటలీలో పెళ్లి వేడుకలు స్టార్ట్ అయ్యి.. జూన్‌ 1న స్విట్జర్లాండ్‌ లో ముగుస్తాయి. మూడు రోజులపాటు ఈ క్రూయిజ్‌ షిప్‌లోనే పెళ్లి వేడుకలు  జరగుతాయి. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్ద స్టార్స్‌ కూడా పాల్గొననున్నారు. మొత్తం 300 మంది వీవీఐపీలు ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

 అయితే ఈ పెళ్లికి హాజరయ్యే వారి కోసం విలువైన బహుమతులను ఇచ్చేందుకు అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. వాటిలో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కళాఖండాలు కూడా ఉన్నాయి. ఈ విలువైన ఫిలిగ్రీ గిఫ్ట్స్ డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచ్చినట్లు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ  అధ్యక్షుడు అర్రోజు అశోక్  తెలిపారు. ఇందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతరత్రా వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. 

కాగా అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం.. 400 సంవత్సరాల నాటి ఈ పురాతన కళకు ప్రోత్సహంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళపై కరీంనగర్‌లోని దాదాపు 150 కుటుంబాలకు ఆధారపడ్డాయి. 2007లో ఈ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించింది. అయితే స్వచ్ఛమైన వెండిని కరిగించి.. అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయారు చేయడం, తీగలు అల్లడం ఇందులో చేస్తారు.