నీట్ లీకేజీపై సుప్రీం జడ్జితో ఎంక్వైరీ చేపట్టాలి

జగిత్యాల టౌన్, వెలుగు: నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు జడ్జితో జ్యుడిషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ చేయించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల ఇందిరా భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ నీట్ లీకేజీలో రూ.వందల కోట్లు చేతులు మారినట్లు అనుమానాలున్నాయన్నారు. 

ఒకే సెంటర్లో  ఆరు నుంచి ఏడుగురికి  720కి 720 మార్కులు రావడం కూడా పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.సీబీఐ కేంద్ర కనుసన్నల్లోనే పనిచేస్తుందని, అలాంటప్పుడు ఈ వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ ఎందుకని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ జ్యోతి, లీడర్లు నాగభూషణం, శంకర్, దుర్గయ్య, మోహన్ పాల్గొన్నారు.