పెండ్లి కావడం లేదని.. ఎక్సైజ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

వీణవంక, వెలుగు : పెండ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ ఎక్సైజ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ సూసైడ్‌‌‌‌ చేసుకున్నాడు. కరీంనగర్‌‌‌‌ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన బొల్లం దేవేందర్‌‌‌‌రెడ్డి (27) హుజురాబాద్‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇంకా పెండ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌‌‌‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లగా అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ బుధవారం చనిపోయాడు. మృతుడి తండ్రి బొల్లం సంపత్‌‌‌‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.