19 ఏళ్లుగా ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్గొడుతున్న బల్దియా ఇంజనీర్

కరీంనగర్, వెలుగు : ఇటీవల పారమిత స్కూల్ బిల్డింగ్ అసెస్ మెంట్ లో అక్రమాలు వెలుగు చూడగా.. తాజాగా బల్దియాలో ఉద్యోగంలో చేస్తూ ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొడుతున్న ఓ ఇంజనీర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ మున్సిపాలిటీలో ఇంజనీర్ గా పని చేస్తున్న రొడ్డ యాదగిరికి ఆయన సతీమణి పేరిట హౌసింగ్ బోర్డు కాలనీలో మూడంతస్తుల ఇల్లు ఉంది. ఈ ఇంటికి తక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేలా అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, యాదగిరిపై చర్య తీసుకోవాలని

అతడి ఇంటిని రీ అసెస్ మెంట్ చేయాలని బండి శ్రీనివాస్ అనే ఆర్టీఐ యాక్టివిస్టు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శనివారం ఫిర్యాదు చేశారు. మున్సిపల్ రికార్డుల ప్రకారం హౌసింగ్ బోర్డు కాలనీ లో 5--7--1132/2 డోర్ నంబర్ కలిగిన ఇల్లు రొడ్డ పద్మారాణి పేరిట ఉంది. మూడంతస్తుల పాష్ బిల్డింగ్ అయినప్పటికీ కేవలం ఒకటే ఫ్లోర్ లో 99.36 మీటర్ల ప్లింత్ ఏరియాలో నిర్మించినట్లుగా చూపి కేవలం ఏడాదికి రూ.1532 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇలా 19 ఏళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న రొడ్డ యాదగిరిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.