షవల్ లోంచి మంటలు.. సింగరేణి ఓసీపీ–5లో తప్పిన ప్రమాదం

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్​పరిధిలోని ఆర్జీ–1 ఏరియా ఓపెన్​కాస్ట్​ 5 ప్రాజెక్ట్​లో మంగళవారం సాయంత్రం ‘సింధు’ షవల్​కాలిపోయింది. ఓపెన్​కాస్ట్​సర్ఫేస్​లోని డంప్​యార్డు నుంచి బొగ్గును షవల్​ద్వారా డంపర్​వెహికల్స్​లో నింపి సీహెచ్​పీకి తరలిస్తుంటారు. బొగ్గును డంపర్​లో నింపుతుండగా ఒక్కసారిగా షవల్​నుంచి మంటలు వ్యాపించాయి. డంపర్​ఆపరేటర్​అరవడంతో షవల్​మెషీన్ ఆపరేటర్ పి.శ్రీను కిందకు దూకాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. 

షవల్​విలువ రూ.కోటికి పైగానే ఉండగా.. దాదాపు70 శాతం కాలినట్టు ఆఫీసర్లు గుర్తించారు. ఘటన ఎలా జరిగిందనే విషయమై ప్రాజెక్ట్​ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. కాలం చెల్లిన మెషీన్లను నడిపించడం, షవల్​మెషీన్ లో ఆయిల్​లీకేజీ కావడం, దానిపై బొగ్గు చూరపడి అది వేడికి మండి మంటలు వ్యాప్తి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.