ఇవాళ(నవంబర్ 4న) అమృత్2.0 ప్రాజెక్టు ప్రారంభం

  • హాజరుకానున్న కేంద్రమంత్రి బండి సంజయ్
  • రూ.147 కోట్లతో పనులు

కరీంనగర్  టౌన్, వెలుగు : కరీంనగర్ స్మార్ట్ సిటీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులో భాగంగా అమృత 2.0 కింద బల్దియా పరిధిలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.147 కోట్లతో చేపట్టనున్నారు. 2050 అవసరాలకు తగ్గట్టుగా సిటీలో జనాభా పెరిగినా నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో అమృత్ కింద రూ.132 కోట్లు  మంజూరు  చేసిన  నిధులతో ప్రతిరోజూ వాటర్ సప్లై చేస్తున్నారు.  

సఫాయిమిత్రలో భాగంగా దేశంలోనే రెండో సిటీగా అవార్డుతో పాటు  రూ.4కోట్ల రివార్డును కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కించుకుంది. త్వరలో 24/7  నీటి  సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిపై మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ అమృత్ 2 ప్రాజెక్టుతో కరీంనగర్ స్మార్ట్ సిటీలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమతుందన్నారు. అమృత్, అమృత్ 2.0 లో కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, అప్పటి రాష్ట్ర మంత్రులు కృషి చేశారన్నారు.