​బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

నందిపేట, వెలుగు : డొంకేశ్వర్​ మండల కేంద్రం నుంచి లొంక రామాలయం మీదుగా  నూత్​పల్లి వరకు బీటీ లింక్ రోడ్డు పనులకు సోమవారం ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్​రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1.32 కోట్ల సీఆర్ఆర్​నిధులతో రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.  

మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్​ఈఈ భావన్న, డీఈ కిషన్​సింగ్, ఏఈ రాజేందర్, తహసీల్దార్​ ఆనంద్​కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.