IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి

మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చాలా విషయాల్లో తన నిర్ణయాన్ని సూటిగా చెప్తాడు. ఎలాంటి అంశమైనా అతను చెప్పాలనుకున్న విషయాన్ని నిజాయితీగా చెబుతాడనే పేరుంది. అమితాబ్ బచ్చన్ కు క్రికెట్ మీద ప్రత్యేక ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. భారత్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు అతను ఎంతో ఆక్టివ్ గా ఉంటాడు. ఇటీవలే భారత్ ఆస్ట్రేలియూ మధ్య ముగిసిన తొలి టెస్టు గురించి స్పందించాడు. ఇందులో భాగంగా అతను కామెంట్రీ వాళ్ళు ఆస్ట్రేలియాను సపోర్ట్ చేశారని నిరాశకు గురయ్యాడు. 

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో కామెంట్రీ పక్షపాతంతో కూడుకుందని ఆయన తెలిపాడు. " బయాస్ కామెంటరీ కే బావజూద్ ठोक दिया Australia को cricket में " అని తన ఎక్స్ లో రాసుకొచ్చారు.  కామెంట్రీలో  పక్షపాతం ఉన్నప్పటికీ, టీమిండియా ఆస్ట్రేలియాను చిత్తు చేసిందని దీని అర్ధం. ఈ మ్యాచ్ తో పాటు..  అదే పోస్ట్‌లో, అమితాబ్.. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ యొక్క కబడ్డీ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌ను అభినందించారు.

Also Read :- వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ

ఈ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో జరగడంతో వారికి మద్దతు లభించింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా  భారత పేసర్ల ధాటికి 104 పరుగులకు ఆలౌట్ అయింది.

బుమ్రా 5 వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. జైస్వాల్ (161) కోహ్లీ (100) సెంచరీలతో చెలరేగారు. 534పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 242 పరుగులకే ఆలౌటైంది.