CAA : సీఏఏతో లక్షలాది మందికి న్యాయం: అమిత్ షా

మోదీ సర్కార్ తెచ్చిన  సీఏఏతో లక్షలాది మందికి న్యాయం జరుగుతోందన్నారు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ లో సీఏఏ కింద పౌరసత్వ పొందిన 188 మంది హిందూ శరణార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. గుజరాత్ లో పర్యటించిన అమిత్  షా.. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 


 

 భారత్ లో ఆశ్రయం పొందుతున్న హిందు, జైన, బౌద, సిక్కులకు అన్యాయం జరిగిందన్నారు. ఇండియా కూటమి వారికి న్యాయం చేయలేదు..మోదీ వారికి న్యాయం చేశారని చెప్పారు.  సీఏఏతో ముస్లీంలకు అన్యాయం జరుగుతుందన్న ప్రతిపక్షాల వాదనలో అర్థం లేదన్నారు.    కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు.  ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు అమిత్ షా.