కార్లలో లాంగ్​ డ్రైవ్​ పోతుంటే టైర్లలో గాలి తగ్గిపోతుందా..? సొల్యూషన్ ఇదిగో..

కార్లలో లాంగ్​ డ్రైవ్​లు చేస్తున్నప్పుడు టైర్లలో గాలి తగ్గిపోతూ ఉంటుంది. అది గమనించకుండా అలాగే డ్రైవ్​ చేస్తే పంక్చర్​ అయ్యే ప్రమాదం ఉంది. పైగా ట్యూబ్​లెస్​ టైర్లకు పంక్చర్​ పడిన వెంటనే గుర్తించడం కూడా కష్టమే. కాబట్టి ఎప్పటికప్పుడు టైర్​ ప్రెజర్​ చెక్​ చేస్తుండాలి. అలాగని.. ప్రతిసారి కారు దిగి ప్రెజర్​ చూడాలన్నా ఇబ్బందే. అందుకే ఇలాంటి ఆటోమెటిక్​ టైర్​ ప్రెజర్​ మానిటర్ సిస్టమ్​ని వాడితే సరిపోతుంది. దీన్ని ఏఎంఐసీ ఆటో అనే కంపెనీ తీసుకొచ్చింది. ప్యాక్​లో మానిటర్​తోపాటు నాలుగు సెన్సర్లు ఉంటాయి. వాటిని టైర్ల వాల్వ్‌‌లకు బిగించాలి.

మానిటర్​ని కారులో ఎక్కడైనా ఫిక్స్​ చేసుకోవచ్చు. దానికి ఉండే ఎల్​సీడీ డిస్​ప్లేలో నాలుగు టైర్ల ప్రెజర్​, టెంపరేచర్​ చూపిస్తుంటుంది. ప్రెజర్​ ఎక్కువైనా, గాలి లీకవుతున్నా, టెంపరేచర్​ పెరిగినా, సెన్సర్​లోని బ్యాటరీలో పవర్​ తగ్గినా అలారం వస్తుంది. మానిటర్​ని యూఎస్​బీతో ఛార్జ్​ చేసుకోవచ్చు. లేదంటే.. సోలార్​తో కూడా ఛార్జ్​ అవుతుంది. టైర్ సెన్సర్లలో CR1632 కాయిన్ బ్యాటరీలు వేయాల్సి ఉంటుంది. అవి 24 నుండి 36 నెలల వరకు పనిచేస్తాయి. ఇన్​స్టాలేషన్​ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.

 ధర : 3,726 రూపాయలు