అక్రమంగా ఉంటున్న ఇండియన్లనువెనక్కి పంపిన అమెరికా సర్కార్

వాషింగ్టన్:  తమ దేశంలోని అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా  దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా యూఎస్​లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉంటున్న ఇండియన్స్​ను ఇంటికి పంపించింది. ఈ నెల 22న వీరిని స్పెషల్​ ఫ్లైట్​లో ఇండియాకు పంపించినట్టు అమెరికా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) వెల్లడించింది. భారత్​ సహకారంతోనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. ‘‘చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న ఇండియన్​ సిటిజన్స్​ను వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం. స్మగ్లర్ల చేతిలో వలసదారులు బందీలు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాం” అని డీహెచ్ఎస్​ సీనియర్​ అధికారి తెలిపారు. 

కాగా, ఈ ఏడాది జూన్​లో బార్డర్​ ప్రెసిడెన్షియల్ విడుదల చేసిన​ నివేదిక ప్రకారం..  అమెరికా సౌత్​వెస్ట్​ బార్డర్​లో అక్రమ వలసలు 55 శాతం తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్షా 60 వేల మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. 495 కంటే ఎక్కువ స్వదేశీ విమానాల్లో 145 దేశాలకు చెందిన వలసదారులను వారి దేశాలకు పంపించింది. డీహెచ్ఎస్​ వెనక్కి పంపిన అక్రమ వలసదారుల్లో కొలంబియా, ఈక్వెడార్​, పెరూ, ఈజిప్ట్, మారిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్తాన్, చైనాకు చెందినవారు కూడా ఉన్నారు.