వరల్డ్ గిన్నిస్ రికార్డుకు ఎక్కిన పేక మేడ.. పేకలతో 7 మీటర్ల ఎత్తైన టవర్

గాల్లో పేక మేడలు కట్టలేము.. కానీ, భూమి పైన కట్టగలము కదా.. అమెరికన్ ఆర్కిటెక్ట్ మరియు ప్రఖ్యాత కార్డ్-స్టాకింగ్ ఆర్టిస్ట్ బ్రయాన్ బెర్గ్ ప్లేయింగ్ కార్డ్స్(పేకలు)తో ఎత్తైన ఇల్లు నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. బెర్గ్ కేవలం 8 గంటల్లోనే పేకాలతో 54 లెవల్ల ఇంటిని నిర్మించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) అధికారిక హ్యాండిల్ బెర్గ్ రికార్డ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

గమ్ లేదా మెటల్ లేకుండా అతను ఈ బిల్డింగ్ నిర్మించాడు. ఈ ఫీట్ చేయడానికి అతను గాలి ప్రభావం లేని చోటును ఎంచుకున్నాడు. 8గంటల్లో బెర్గ్ స్కాక్స్, వాటర్ తీసుకోవడానికి కొంత సమయాన్ని తీసుకున్నాడు.. దాదాపు 8 గంటల్లో దాదాపు 6, 7 గంటలు నాన్ స్టాప్ ఇంటి నిర్మాణానికే కష్టపడ్డాడు. ఇతను 7.86 మీటర్లు (25 అడుగుల 9 అంగుళాల) ఎత్తైన పేక మేడను కట్టి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కాడు.

ALSO READ | కవర్ స్టోరీ : ఇరానీ చాయ్​ ఎలా పుట్టింది?.ఎందుకంత ఫేమస్

బెర్గ్ గతంలో 10.39 మీటర్ల ఎత్తు, 2.88 మీటర్ల ఎత్తు, 3.54 మీటర్ల ఎత్తున్న నిర్మాణాలు కూడా చేశాడు. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్ నిర్మాణాన్ని కూడా సృష్టించాడు. అయితే ఈ రికార్డును 2023లో భారతదేశానికి చెందిన అర్నవ్ డాగా 12.21 మీటర్ల ఎత్తైన ఇంటిని నిర్మించి బద్దలు కొట్టాడు.