మనం ఎలా చేస్తామో.. పిల్లలు అలాగే చేస్తారంట.. !

అమెరికాకి చెందిన 'అల్బెర్ట్ ' బండూర' అనే సైంటిస్ట్ 1961లో చైల్డ్ పర్సనాలటీపై ఒక ప్రయోగం చేశాడు. అదే బోల్ ఎక్స్ పరిమెంట్ బోబో డాల్ అంటే మనం ఎంత తోసినా, పడేసినా మళ్లీ నిలబడే బొమ్మ. దీన్ని అందరూ చూసే ఉంటారు. ఈ ప్రయోగం కోసం. బండూర.. స్టాన్ఫోర్డ్ నర్సరీ బడిలోంచి 72 మంది పిల్లలను సెలక్ట్ చేసుకున్నాడు. వీళ్లలో సగం మంది మగపిల్లలు, సగం మంది ఆడపిల్లలు ఉన్నారు. 

ఈ 72 మందిని బండూర మూడు గ్రూపులుగా డివైడ్ చేశాడు. ఒక్కో గ్రూప్ లో 24 మంది ఉంటారు.  ఈ ప్రయోగం కోసం పరిశోధకులు మూడు గదుల నిండా ఆటబొమ్మలను ఉంచి, ఒక్కో గదిలోకి ఒక్కో గ్రూపు పిల్లల్ని పంపారు. మొదటి గదిలోకి ఒక పెద్ద వ్యక్తి ప్రవేశించేవాడు. అతను బొమ్మల్ని చూస్తున్నట్లుగా కాసేపు నిలబడి, తర్వాత బోబో దాల్ తో ఆడటం మొదలు పెట్టేవాడు. 

అలా మొదలైన ఆట కాస్తా క్షణాల్లో దూకుడుగా మారిపోయేది. ఆ బొమ్మని పదేపదే తన్నడం, గాల్లోకి ఎగరేయడం, సుత్తితో బాదడం, తిట్టడం... లాంటివి చేసేవాడు. ఇది ఒక గ్రూపుతో చేసిన ప్రయోగం. ఇక రెండో గ్రూప్ ఉన్న గదిలోకి మరో వ్యక్తి ప్రవేశించి, బోబోడాల్ని ఈ రోజుల్లో మొబైల్స్, టెక్నాలజీ వాడకం పెరిగింది. కాబట్టి.. పిల్లల మీద వాటి ప్రభావం పడుతుందని అందరూ వాదిస్తుంటారు. 

కానీ.. అసలు మొబైల్స్ రాకముందే పిల్లల ప్రవర్తనమీద ఓ ప్రయోగం జరిగింది. అందులో పిల్లలు పెద్దవాళ్లను అనుకరిస్తారని తేలింది. ఆ ప్రయోగమే ఇప్పటి ఎన్నో ప్రయోగాలకు ఆధారం. ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండిపోయాడు. ఇక మూడో గ్రూప్ పిల్లల రూమ్కి ఎవరూ వెళ్లనేలేదు. ఇలా రకరకాల వాతావరణాల మధ్య ఉన్న పిల్లలను ఉంచి కాసేపటి తరువాత.. మరో గదిలోకి పంపారు. అక్కడ ఊహించిందే జరిగింది! అక్కడ పిల్లలకు బోబో దాల్ కనిపించగానే వాళ్లు అంతకు ముందు చూసిందే అనుకరించడం మొదలుపెట్టారు. 

ఏ పిల్లల ముందైతే పెద్దవాళ్లు దాటిని కొడుతూ ప్రవర్తించారో.. ఆ పిల్లలు బోబో డాల్ని బాదడం మొదలుపెట్టారు. ఏ పిల్లల ముందైతే పెద్దవాళ్లు సైలెంట్ గా ఉన్నారో... ఆ పిల్లలు మిగతా వాళ్లకంటే క్రమశిక్షణగా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రభావంలో ఆడపిల్లలు, మగపిల్లలు అన్న తేడా కనిపించలేదు. కాకపోతే మగపిల్లలు బొమ్మను కొడుతుంటే.. ఆడపిల్లలు మాత్రం బొమ్మను తిడుతున్నారట. 

బోబోడాల్ ఎక్సీ పరిమెంట్ కంప్లీట్ ఎక్స్పరిమెంట్ అని చెప్పుకోవడానికి లేదు. ఈ ప్రయోగం నిజజీవితంలో ఎంతవరకూ ప్రభావం చూపుతుంది? పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? వంటి ప్రశ్నలెన్నో తలెత్తాయి. కానీ పిల్లలు చూసిందే అనుకరిస్తారని మాత్రం ఈ ప్రయోగంతో తేలింది. అందుకే ఈ ప్రయోగాన్ని చేసి 50 ఏళ్లు దాటిపోతున్నా, ఇప్పటికీ సైకాలజిస్టులు దీని గురించి చర్చించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు పిల్లలపై చేసే ఎన్నో ప్రయోగాలకు ఈ ప్రయోగమే ఆధారం.