టిప్పర్ను ఢీకొట్టిన అంబులెన్స్..ఒకరు మృతి, ఇద్దరు పేషెంట్లకు తీవ్రగాయాలు

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్ ను అంబులెన్స్ ఢీకొట్టింది. శనివారం( సెప్టెంబర్ 14, 2024) జరిగిన ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ మృతిచెందగా.. పేషెంట్ తో సహా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.  

మిర్యాగాల గూడ మండలం గూడూరు వద్ద రామకృష్ణా రైస్ మిల్ సమీపంలో ఆగివున్న టిప్పర్ ను అంబులెన్స్ ఢీకొట్టింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న అంబులెన్స్..రోడ్డుపై నిలిపి ఉన్న టిప్పర్ ను  ఢీకొట్టింది. అంబులెన్స్ డ్రైవర్ రాకేష్ ( 24) అక్కడికక్కడే మృతిచెందాడు. 

అంబులెన్స్ ఉన్న కిడ్నీ పేషెంట్, అతని సహాయకుడిని తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్సకోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.