అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!

కొత్తరకం లడ్డూ ఒకటి ఇంటర్నె్ట్‍లో వైరల్‌గా మారింది. అదే అంబానీ లడ్డూ.  ఈ లడ్డూ అన్నీ లడ్డూలకంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తయారు చేయడానికి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ వంటకం సోషల్ మీడియాలో 32 మిలియన్లకు పైగా వ్వ్యూవ్స్ సొంతం చేసుకుంది. మొత్తం వరల్డ్ వైడ్ గా ఫుడ్ లవర్స్ ను అంబానీ లడ్డూ అట్రాక్ట్ చేసింది. బాగా డబ్బులు ఉన్నవారే దీన్ని తినగలరు.. తయారు చేసుకోగలరు. అందుకే దీనికి ఇండియన్ రిచెస్ట్ ఫ్యామిరీ పేరు మీదుగా అంబానీ లడ్డూ అని పేరు వచ్చింది. ఇది బాగా టేస్టీగా ఉండటమే కాదు.. పవర్ ఫుల్ ఫుడ్ కూడా. అంబానీ లడ్డూను ఫుడ్ కంటెంట్ క్రియేటర్ ఇషికా సాహు ఫస్ట్ టైం తయారు చేశారు. ఆమె ఆ లడ్డూ తయారు చేస్తూ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

అంబానీ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు

బాదం, జీడిపప్పు, పిస్తాపప్పులు, గింజలు లేని ఖర్జూరాలు, ఎండిన ఆప్రికాట్లు, అత్తిపండ్లు, పొద్దుతిరుగుడు లేదా నువ్వుల గింజలు
ఇవి చాలా ఖరీదైన పదార్థాలు. పుష్కలంగా పోషకాలు ఉండే డ్రై ఫ్రూట్స్.. ఇవి అంబానీ లడ్డూకు డిఫరెంట్ టేస్ట్ తోపాటు అందంగా కూడా కనిపిస్తాయి. 

తయారు చేసుకునే విధానం :

ఫస్ట్ బాదం, జీడిపప్పులను మీడియం హీట్‌లో సువాసన వచ్చే వరకు వేయించాలి. పిస్తా వేసి మరో 2-3 నిమిషాలు వేయించాలి. బాదంపప్పులు లేత బంగారు రంగులోకి మారినప్పుడు, వాటిని పాన్ నుంచి తీసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసి, తర్వాత పాన్ మీద ఖర్జూరాలు, ఎండు ఆప్రికాట్లు, అత్తి పండ్లను వేయండి. వాటిలో గింజలు, పుచ్చులు లేకుండా నీట్ గా శుభ్రం చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న పదార్థాలన్నీ పూర్తిగా చల్లబర్చుకోవాలి. అన్ని గింజలు బాగా వేయించిన తర్వాత, వాటిని మీ బ్లెండర్‌లో వేసి ముతకగా ఉండేలా మిక్సీలో గ్రైండ్ చేయండి. తర్వాత ఆ మిశ్రమాన్ని  గుండ్రంగా లడ్డూల్లా చుట్టుకోవాలి. దీంతో రుచికరమైన అంబానీ లడ్డూ తయారైనట్లే..