సూపర్ ఆఫర్స్:అమెజాన్లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్.. ఏ ఫోన్ ఎంత అంటే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024సేల్..సెప్టెంబర్ 27నుంచి సేల్ ప్రారంభంకానుంది. ఈసేల్లో ఈ కామర్స్ ఫ్లాట్ఫాం అమెజాన్..టాప్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. iPhone13, Samsung Galaxy S23 Ultra, Xiaomi 14 వంటి క్రేజీ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.ఇది అమెజాన్ సబ్ స్క్రైబర్లకు సెప్టెంబర్ 26 నుంచే ఈ డిస్కౌం ట్లు అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ ఎంతెంత డిస్కౌంట్ అందిస్తుందో తెలుసుకుందాం.

iPhone 13 పై డిస్కౌంట్ 

ఐఫోన్ 13 అసలు ధర రూ. 79వేల 990..డిస్కౌంట్ తర్వాత రూ.49వేల 900లకు లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్లతో డిస్కౌంట్ కలిపి రూ.37, 999 లకు లభిస్తోంది. ఇక iPhone 13ఫీచర్ల విసయానికి వస్తే.. ఈ స్మార్ట ఫోన్ స్క్రీన్ 6.1 అంగుళాలుంటుంది. ఇది సూపర్ రెటినా XDR డిస్ ప్లే తో Apple A15 బయోనిక్ ప్రాసెజర్, 12 మెగా పిక్సెల్ డ్యుయెల్ రియర్ కెమెరా ఉంటాయి.

Samsung Galaxy S23 Ultra పై డిస్కౌంట్ 

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ  హ్యాండ్ సెట్ అసలు ధర రూ. 1లక్షాల 49వేల 999 ఉంది. బ్యాంక్, కూపన్ ఆఫర్లతో ఇది రూ. 69వేల 999 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ హై ఎండ్ ఫోన్ పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 8Gen2 ప్రాసెసర్, 6.8 అంగుళాల QHD+ డిస్ ప్లే, 200 MP మెయిన్ సెన్సార్, మల్టిపుల్ టెలిఫొటో , అల్ట్రా వైడ్ లైన్స్ లతో కూడిన టాప్ నాచ్ కెమెరా సిస్టమ్తో అద్భుతమైన పనితీరును చూపిస్తుంది. 

Xiaomi 14 పై తగ్గింపు ఎంతంటే.. 

అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో భాంగా Xiaomi 14 పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్  అసలు ధర రూ. 69వేల 999 ఉండగా.. ఫెస్టివల్ డిస్కౌంట్ తర్వాత రూ. 47వేల 999 కంటే తక్కువ ధరకు లభిస్తోంది. 

ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్లో 6.55 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ ప్లే, పవర్ ఫుల్ Snapdragon 8s Gen3 ప్రాసెసర్ ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్లో 50 MP మెయిన్ మెరా, 50MP టెలిఫోటో లెన్స్,12MP అల్ట్రా వైడ్ లెన్స్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్తో లభిస్తోంది.