Amazon Great Freedom Festival Sale: ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు,ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్స్.. ఫుల్ డిటెయిల్స్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా గ్రేట్ ఫ్రీడం సేల్ ఇండియాకు అమెజాన్ రంగం సిద్దం చేసింది. ఆగస్టు 6 న ప్రారంభమై12 తేదీ వరకు అమెజాన్ అమ్మకాలు ఉంటాయి.ఈ సేల్స్ లో అమెజాన్ చాలా  రకాలల ప్రాడక్టులపై మంచి ఆఫర్లను ఇవ్వబోతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మంచి ఆఫర్లు ఉన్నాయి. దీంతోపాటు సేల్స్ ప్రారంభానికి 12 గంల ముందే ఆఫర్లతో సేల్స్ ప్రారంభమవుతాయి. 

ఈ సేల్స్ లో అమెజాన్ ఎస్ బీఐ  క్రెడిట్ కార్డు తో లింకప్ అయి వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది. రాబోయే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్  సేల్ లో వివిధ రకాల ప్రాడక్టులపై డిస్కౌంట్లు, డీల్స్ అందించబడతాయి. ఈ కామర్స్ వెబ్ సైట్ లో ప్రత్యేక ఆఫర్లు, డీల్స్ కోసం ప్రత్యేక పేజీని ఓపెన్ చేశారు.ధరలు, డీల్స్ ఇంకా వెల్లడించనప్పటికీ ఈ సేల్ లో ఫ్లాగ్ షిప్, మిడ్ రేంజ్ , బడ్జెట్ ఆప్షన్లతో సహా వివిధ స్మార్ట్ ఫోన్లపై మంచి ఆఫర్లుఉంటాయని అంచనా. 

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో  OnePlus ఓపెన్ ఫోల్డబుల్, OnePlus 12, iQOO Neo 9 Pro, iQOO 12, Realme Narzo 70 Pro, Redmi 13 5G, Redmi Note 13 Pro 5G, Samsung Galaxyతో సహా పలు రకాల స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ధరలు ఉంటాయి. S24, Galaxy M15 5G వాటికి కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు, Apple iPad, Xiaomi Pad 6, OnePlus Pad Go, Sony WH-1000XM4/XM5, బోట్ ఎయిర్‌డోప్స్ 311 ప్రో, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్‌ డివైజ్ లపై ఆఫర్లు అదిస్తోంది.

స్మార్ట్ స్పీకర్లు , ఫైర్ టీవీ స్టిక్‌లతో సహా అమెజాన్ సొంత ప్రాడక్టులపై సేల్ సమయంలో 40 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. గేమింగ్ కన్సోల్‌లు, గేమ్‌లు, హోమ్ యుటిలిటీస్, ఫ్యాషన్ వస్తువులపై కూడా డిస్కౌంట్లు అందిస్తుంది.  అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వ్యవధి ప్రస్తుతం అస్పష్టంగా ఉంది.. ప్రస్తుతానికి నిర్దిష్ట ముగింపు తేదీ లేదు.