ఇది నిజం..అమ్మతోడు: మనిషే.. కారులా మారిపోయాడు.. ఫిదా అయిన నెటిజన్లు

సోషల్ మీడియా అనేది ఓ ప్రత్యేక ప్రపంచం.. ఇంతకు ముందెన్నడూ మనం చూడని ప్రపంచంలోని ఎన్నో వింతలు.. ఆశ్చర్యపర్చే అద్భుతాలు.. అతిభయం కరమైన దృశ్యాలు ఇలా ఎన్నో విశేషాలను మనకు చూపుతుంది. ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. ఒక మనిషి తనకు తానుగా ఓ కారు రూపంలోకి మారిపోవడానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చేతులకు, కాళ్లకు చక్రాలు ఉన్న రోబోటిక్ టినీ కారుగా మారిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై కారు విడి భాగాలతో నిలబడి ఉన్న ఆ మనిషి.. క్షణాల్లో  నేలపై కూర్చొని కారు రూపంలోకి మారిపోయాడు.  దీంతో దారిలో పోతున్న జనం అతని చర్యలు చూసి ఆశ్చర్యపోయారు. అతని యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా ఉండటంతో వాళ్లు చూపును తిప్పుకోలేకపోయారు. తిరిగి అతను కారు రూపం నుంచి మనిషిగా మారుతున్నప్పుడు చూసి ఓ మహిళ షాక్ గురవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. 

ఇదంతా టెక్నాలజీమాయ..టెక్ యుగంలో మనుషులు సృష్టించిన అద్భుతాలు.. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందిందో ఇది చెపుతోంది. వాస్తవానికి ఇది ఒక బొమ్మ.. దీనిని కూల్ టోయ్ అంటారు. ఇలాంటి బొమ్మలతో ఆధునిక టెక్నాలజీ వినియోగించి హాలీవుడ్ లో ట్రాన్స్ ఫార్మర్స్ ( రైస్ ఆఫ్ బీస్ట్) సినిమా కూడా తీశారు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యక్తి చేసిన యాక్షన్ అన్ని ట్రాన్స్ ఫార్మర్ సినిమాకు ట్రైలర్ అని అంటున్నారు. ఏది ఏమైనా..ఆధునిక టెక్నాలజీతో ఆ వ్యక్తి అందరిని ఎంటర్ టైన్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.