బీఎస్పీకి అమర్​నాథ్ ​బాబు గుడ్​బై

బోధన్, వెలుగు : బీఎస్పీ బోధన్​ నియోజకవర్గ ఇన్​చార్జి అమర్​నాథ్​బాబు ఆ పార్టీకి గుడ్​బై​ చెప్పారు. టౌన్​లో బుధవారం నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు.

పార్లమెంట్​ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్​ కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేకే పార్టీ నుంచి వైదొలుగుతున్నానన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.