40 ఏండ్లకు ఆత్మీయంగా కలుసుకున్నారు

ఎల్లారెడ్డిపేట, వెలుగు: 40 ఏండ్ల కింద కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు అదే బడిలో కలుసుకొని వారి అనుభూతులు పంచుకున్నారు. ఎల్లారెడ్డిపేట హైస్కూల్ లో 1982-–83లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. నాలుగు దశాబ్దాల  తర్వాత కలుసుకుని నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. వారు మాట్లాడుతూ ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. సమ్మేళనంలో పూర్వవిద్యార్థులు రాధాకృష్ణ , బండారి బాల్ రెడ్డి, శ్రీగాధ  అశోక్, బందారపు బాల్ రెడ్డి, రామ్, సురేశ్‌‌, లక్ష్మారెడ్డి, గుండాడి రాంరెడ్డి, తీగల  రాజేశ్‌‌గౌడ్‌‌, ఇంద్రాసేనారెడ్డి,  ఆంజనేయులు, దేవాంతం, శంకర్ , దేవాదాస్ , దాస్ పాల్గొన్నారు.

చందుర్తి, వెలుగు: చందుర్తి మండల కేంద్రంలోని స్కూల్‌‌ ఆవరణలో పూర్వ విద్యార్థులు కులుసుకున్నారు. 2000–01 లో టెన్త్‌‌ చదివిన విద్యార్థులతో పాటు చదువు చెప్పిన గురువులు ఒక్కచోట చేరి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగోగులు తెలుసుకున్నారు. నాటి గురువులను సన్మానించారు. అందరూ కలిసి విందు భోజనాలు చేశారు. 


కోనరావుపేట,వెలుగు: కోనరావుపేట మండలం మరిమడ్ల హైస్కూల్‌‌లో 2006–--07 టెన్త్‌‌ పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత ఒకరు కలుసుకుని కుటుంబ యోగక్షేమాలు తెలుసుకొని,చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. -