దోమలు... ఫలానా సీజన్ అని కాకుండా ఎప్పుడూ ఉంటాయని అవి కుడితే మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తాయని తెలియందెవరికి! అంతేకాదు చాలావరకు వైరల్ ఇన్ఫెక్షన్లకి దోమలే కారణం. వీటిని ఇంట్లోంచి తరిమేయడానికి ఒకప్పుడు దోమ తెరలు వాడేవాళ్లు. ఇప్పుడు లిక్విడ్ వేపరైజర్, మస్కిటో కాయిల్స్ (దోమల బిళ్లలు) వాడుతున్నారు చాలామంది కానీ, వీటిని వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ కొనితెచ్చుకుంటున్నామన్న సంగతి గుర్తించట్లేదు. లిక్విడ్ వేపరైజర్ నుంచి వచ్చే రసాయనాలు, మస్కిటో కాయిల్స్ పొగ హెల్త్ ప్రాబ్లమ్స్ కి దారి వేస్తున్నాయి. అందుకే దోమలు ఆల్టర్నేటివ్ మెథడ్స్ పాటించాలి అంటున్నారు ఫిజీషియన్ జి.నవోదయ.
లిక్విడ్ వేపరైజర్, లిక్విడ్ స్ప్రేలోనూ సువాసనతో పాటు ప్రల్లెథ్రిన్ అనే పెస్టిసైడ్ ఉంటుంది. లిక్విడ్ వేపరైజర్, మస్కిటో కాయిల్ పెట్టిన కొంచెం సేపటికే కొందరికి తలనొప్పి వస్తుంది. కళ్లు మండుతాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. చర్మం మీద దద్దుర్లు కూడా వస్తాయి. కొందరు ఆ వాసన, పొగ పడక వాంతి చేసుకుంటారు కూడా. దోమల బిళ్లల తయారీలో అల్యూమినియం, క్రోమియం, టిన్, వంటి హెవీ మెటల్స్, పెరిత్రిన్ అనే పెస్టిసైడ్స్, ఇన్ సెక్టిసైడ్స్, సిట్రోనెల్లా వంటి అరోమాటిక్ పదార్థాలు (సువాసనతో ఉన్నవి) వాడతారు.
అందుకే వాటిని ముట్టుకుంటే ఘాటు వాసన వస్తుంది. వీటిని కాల్చినప్పుడు వచ్చే పొగలో కార్సినోజెన్స్ ఉంటాయి. ఈ పొగని ఎక్కువ రోజులు పీల్చితే ఊపిరితిత్తుల కొంచెం క్యాన్సర్ రావొచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లకి ఆ సమస్య సేపటికే మరింత ఎక్కువ అవుతుంది. కొందరిలో క్రానిక్ అబ్జెక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సిఓపిడి) కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా కారణం..
వేపరైజర్ పెట్టినప్పుడు, మస్కిటో కాయిల్స్ వెలిగించినప్పుడు తలుపులు, కిటికీలు మూసేస్తారు. దాంతో గాలి బయటకి పోదు. బయటిగాలి లోపలి రాదు. వాటి నుంచి వచ్చే రసాయనాల్ని పీల్చుకోక తప్పదు. అలాగని తలుపులు, కిటికీలు తెరిచి దోమల బిళ్లలు వెలిగిస్తే ఉపయోగం ఉండదు. అందుకే దోమలు ఇంట్లో రాకుండా, కుట్టకుండా ఇతర పద్ధతులు పాటించాలి.
ఇలాచేస్తే బెటర్
దోమ తెరలు వాడితే తరిమేందుకు రసాయనాలు ఉన్న మందులు అవసరం ఉండదు. మెయిన్ డోర్ కిటికీలకు కూడా దోమ తెరలు పెట్టించాలి. చీకటికాక ముందే కిటికీలు, తలుపులు క్లోజ్ చేయాలి. మస్కిటో బ్యాట్స్ వాడాలి. మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్స్ రాసుకుంటే దోమలు కుట్టవు. ఒకవేళ ఇలాంటివి రాసుకున్నప్పుడు ఎలర్జీగా అనిపిస్తే మానేయాలి. అలాంటివేం రాలేదంటే కంటిన్యూ చేయొచ్చు. ఇంటి చుట్టుపక్కల మురికి నీరు, నిల్వ నీరు ఉంటే వాటిలో దోమలు పెరుగుతాయి. అందుకే పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆస్తమా, క్రానిక్ అ పల్మొనరీ డిసీజ్ లు ఉన్నవాళ్లు కిటికీలకు కూడా దోమ తెరలు పెట్టించాలి. చీకటికాక ముందే కిటికీలు, తలుపులు క్లోజ్ చేయాలి.
రాత్రిపూట నిండుగా డ్రెస్ వేసుకోవాలి. దోమలు కుట్టకుండా క్రీమ్స్ రాసుకోవాలి. , మస్కిటో బ్యాట్స్ వాడాలి. మస్కిటో రెపెల్లెంట్ కాయిల్స్, ప ఎక్కువగా వాడొద్దు. మరీ ముఖ్యంగా వీటిని కన్సల్టెంట్, జనరల్ మెడిసిన్ చిన్నపిల్లలకి దూరంగా పెట్టాలి.
చిన్నపిల్లల్లో..
మస్కిటో కాయిల్స్ వల్ల చిన్నపిల్లల్లో ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చేఅవకాశం ఉంది. పిల్లలు పొరపాటున కాయిల్ని మింగితే పాయిజన్ అవుతుంది. కాలుతున్నప్పుడు వాటిని ముట్టుకుంటే గాయాలు అవుతాయి. వేపరైజర్ నుంచి వచ్చేరసాయనాలు కూడా పిల్లల్లో ఆస్తమా, తలనొప్పికి కారణమవుతాయి.