రూ.20 లక్షల విలువైన అల్ఫ్రాజోలం పట్టివేత

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్​సమీపంలో గురువారం నిజామాబాద్​ఎక్సైజ్​ఎన్​ఫోర్స్​మెంట్​టీమ్ రెండుకిలోల 100 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్​ఆఫీసర్లు తెలిపారు. రాజస్థాన్​నుంచి కామారెడ్డికి ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్,​ఎన్​ఫోర్స్​మెంట్​ఆఫీసర్లు నిఘా పెట్టారు. టీఎస్08జెవై0025 వ్యాగనార్​కారులో ఈ మత్తు పదార్థం పట్టుబడింది. దాడిలో రాజస్థాన్​కు చెందిన భవానీసింగ్​పట్టుబడగా, అదే రాష్ట్రానికి చెందిన ముఖేశ్​సింగ్, హైదరాబాద్​కు చెందిన సుదర్శన్​పరారీ అయ్యారు.