నల్గొండ అర్బన్, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు మానవతా విలువలు నేర్చుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నల్గొండలోని కనగల్ మహాత్మాజ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల గ్రౌండ్లో ఆటలాడుతున్న విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులపై పశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను లేపి జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారని అడిగారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడి చదువుకోవాలని చెప్పారు. హాస్టల్ స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, బాత్రూంలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ భిక్షమయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
చదువుతోపాటు మానవతా విలువలు నేర్చుకోవాలి: కలెక్టర్ నారాయణరెడ్డి
- నల్గొండ
- September 14, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.