Good Health : గ్రీన్ టీలో.. కలబంద కలిపి తాగితే.. ఇట్టే బరువు తగ్గుతారు..!

కలబంద ముఖ సౌందర్యాన్నిపెంచడంలోనే కాదు, శరీర బరువు తగ్గించటంలో కూడా కలబంద ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీలో ఒక స్పూన్ కలబంద జ్యూస్ కలుపుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే గ్రీన్ టీలో కలబంద రసం, తేనె, నిమ్మరసం కలుపుకుని రోజూ పరగడుపున ఒక కప్పు, పడుకోవడానికి గంట ముందు ఒక కప్పు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ALSO READ |Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే రాత్రి పూట పాలలో వీటిని కలుపుకుని తాగండి..!

ఇతర పదార్థాలేవీ కలపడానికి ఇష్టం లేకపోతే రోజు గ్రామ గోరువెచ్చటి నీటిలో రెండు స్పూన్ల కలబంద జ్యూస్ కలుపుకుని తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్దిరోజుల్లోనే శరీర బరువులో మార్పు వస్తుంది. అలాగే ఏదైనా ఫూట్ జ్యూస్ లో కలిపి కూడా కలబంద జ్యూస్ ని తాగొచ్చు. కావాలంటే అచ్చంగా కలబంద దసాన్ని కూడా తీసుకోవచ్చు.