Pushpa 2 Run Time: ఆర్ఆర్ఆర్ను దాటిన పుష్ప 2 ర‌న్ టైమ్.. ఇంత పెద్ద సినిమానా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప : 2 ది రూల్ వచ్చే నెల డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాని ఈ సారి వరల్డ్ వైడ్గా మోత మోగిపోయేలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

అయితే లేటెస్ట్గా పుష్ప 2 మూవీ రన్ టైమ్ రివీలైంది. టాలీవుడ్ సినిమాలలో హయ్యెస్ట్ నిడివి గల సినిమాలలో పుష్ప 2 రికార్డ్ కొట్టబోతోంది. మూడు గంట‌ల ప‌ది నిమిషాల ర‌న్ టైమ్‌తో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ఓవ‌ర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో చూపిస్తోంది. అలాగే పుష్ప : 2 ది రూల్ రన్ టైం అని సెర్చ్ చేసిన ఇదే వస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి.. ఈ రెండు సినిమాల నిడివి మూడు గంట‌ల ఆరు నిమిషాలు. ఇప్పుడు ఈ రెండు మూవీస్ ని మించిన ర‌న్ టైమ్‌తో పుష్ప 2 రాబోతోంది.

ALSO READ | సూర్య ఫ్యాన్స్ కి తమిళనాడు గవర్నెమెంట్ బిగ్ షాక్. ఏంటంటే..?

అంతేకాదు.. మహేష్ బాబు నటించిన నిజం మూవీ మూడు గంట‌ల ఏడు నిమిషాలతో వచ్చింది. ఈ లెక్కన చూస్తే.. తెలుగు సినీ చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ ర‌న్‌టైమ్ మూవీస్లో ఒకటిగా పుష్ప 2 నిలవబోతోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎవర్ గ్రీన్ ఫిల్మ్ 'దాన వీర శూర కర్ణ' సినిమా నిడివి 226 నిమిషాలు (3 గంటల 46 నిమిషాలు)తో ఫస్ట్ ప్లేస్లో ఉంది.

ఇక రిలీజ్ రన్ టైంతోనే రికార్డులు క్రియేట్ చేస్తోన్న పుష్ప రాజ్.. థియేటర్స్కి వచ్చాక ఎలాంటి వసూళ్ల సునామి స్పృష్టిస్తాడో అని ఆసక్తిగా ఉంది. ఇక ఇప్ప‌టికే ఓవ‌ర్‌సీస్‌లో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.  అక్కడ హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. కాగా పుష్ప 2 ట్రైల‌ర్‌ న‌వంబ‌ర్ 17న రిలీజ్ కానుంది. త్వరలో కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాదులలో ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు మేకర్స్.