లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఆరోపణల క్రమంలో ఇప్పటి వరకు 17 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. మలయాళ సినీ నటీనటుల సంఘం అమ్మా(AMMA) కూడా రద్దయింది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులను, నిర్మాతలను పోలీసులు విచారింనున్నట్లు తెలుస్తోంది.
సినీ నటి సోనియా మల్హర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగు చూసింది. 2013లో ఓ సినిమా సెట్స్‌లో ఓ నటుడు తనను వేధించాడని మల్హర్ ఆరోపించింది. దీనిపై కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. దర్యాప్తు బృందానికి నటి తన ఫిర్యాదును దాఖలు చేసింది.
మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలపై కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. సోనియా మల్హర్ కంటే ముందు సినీ నటి మీను మునీర్ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇప్పుడు తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని మీను మునీర్ పేర్కొంది. ఈ విషయాన్ని మీనూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం త్వరలో మీను మునీర్ వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.
మలయాళ సినీ నటుడు సిద్ధిఖీపై కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి. 2016లో సిద్ధిఖీపై ఓ సినీ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు. సిద్ధిఖీపై ఇది రెండో ఎఫ్ఐఆర్. మలయాళ చిత్ర పరిశ్రమలో పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక గత వారం వెలుగులోకి రావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులపై ఆరోపణల వెల్లువ మొదలైంది.
మలయాళ చిత్ర పరిశ్రమను 10-15 మంది పురుష నిర్మాతలు, దర్శకులు, నటీనటులు నియంత్రిస్తున్నారని 235 పేజీల నివేదిక పేర్కొంది. ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ హేమ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేయగా.. 2019లో తన నివేదికను సమర్పించింది. నివేదిక విడుదలపై న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నందున ఇప్పటి వరకు బహిరంగపరచలేదు.