నల్గొండ జిల్లా వ్యాప్తంగా :కొలువుదీరిన గణనాథుడు

నల్గొండ జిల్లా:ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేషుడు కొలువు దీరాడు. వినాయక చవితి సందర్భంగా శనివారం అన్నిచోట్ల విగ్రహాలు ప్రతిష్టించారు. దాదాపు 8,356 విగ్రహాల ఏర్పాటుకు పోలీసుశాఖ అనుమతులు ఇచ్చింది. నల్గొండ జిల్లాలోనే 3,356 విగ్రహాలు ఏర్పాటు చేయగా, సూర్యాపేటలో మూడు వేలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వేల పైచిలుకు విగ్రహాలు ఏర్పాటు చేశారు.

ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గణనాథుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. శని, ఆదివారాల్లో విగ్రహదాతలు, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండలో ఒకటో నంబర్ విగ్రహం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. పట్టణంలో పలు వార్డుల్లో విగ్రహాల వద్ద ఏర్పాట్లను మంత్రి స్వయంగా పర్యవేక్షించి అధికా రులకు పలు సూచనలు చేశారు. - వెలుగు నెట్​వర్క్

Also Read :- యాదగిరిగుట్టలో భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ