పెద్దపల్లి జిల్లాకు అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా కాకా పేరు పెట్టాలి

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్​ లేదా కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని ఆల్​ ఇండియా అంబేద్కర్​ యువజన సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం సంఘం ఆఫీసులో జరిగిన మీటింగ్​లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేశ్ పాల్గొని మాట్లాడారు. ఈ విషయం సీఎంకు చేరేలా త్వరలో పోస్ట్​ కార్డు ఉద్యమం చేపడతామని ప్రకటించారు. మీటింగ్​లో సంఘం లీడర్లు కొంకటి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌, మంథెన లింగయ్య, ఇరుగురాల కిష్టయ్య పాల్గొన్నారు.