Hero MotoCorp: జూలై నుంచి హీరో బైక్ ల ధరలు పెరుగుతున్నాయ్

హీరో బైకులంటే ఎవరికి ఇష్టం ఉండదు..భారతదేశంలో ప్రతి దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉపయోగించే మైలేజ్, నాణ్యతలో మెరుగైన పనితీరు గల బైక్ అంటే హీరో బైకులు. ఎక్కువ మన్నిక గల బైకులు ఇవి ప్రసిద్ది.. మంచి పికప్, మైలేజ్ అందించే బైకులలో ఇవి బెస్ట.. అలాంటి బైకులు హీరో బైకులు, స్కూటర్ల ధర లు పెరగనున్నయాయి. ఈ విషయాన్ని స్వయంగా Hero Moto Corp ఇదివరకే ప్రకటించింది. జూలై 1 నుంచి కొత్త ధరలు అమలు చేస్తారట. 

ప్రముఖ బైక్ తయారీ సంస్థ Hero Moto Corp జూలై1 నుంచి బైకుల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్కూటర్లు, మోటార్ సైకిళ్ల విభాగంలో ధర పెంచే ప్రణాళికలను వెల్లడించంది.ఇన్ పుట్ ఖర్చులు ఎక్కవవుతుండటంతో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

Hero Moto Corp షేర్ చేసిన వివరాల ప్రకారం.. హీరో బైక్ శ్రేణిలోని అన్ని బైకులకు రూ.1500 వరకు పెంచే అవకాశం ఉంది. ఖచ్చితమైన ధర పెరుగుదల అనేది మోడల్ పై ఆధారపడి ఉంటుంది. 

ప్రస్తుతం భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ కొత్త ప్రాడక్టులు Xtreme 25R, మావెరిక్ 440, Karizma XMR, Harley Davidson x440 మార్కెట్లో ఉన్నాయి. స్కూటర్ విషయానికి వస్తే డెస్టినీ ప్రైమ్, డెస్టిని 125 ఎక్స్‌టెక్, ఎక్స్00ఎమ్ ,ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్‌లను కలిగి ఉన్న టాప్ ఆఫర్‌ల ద్వారా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ కస్టమర్లకోసం మరో ప్రాడక్ట్ ను కూడా విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది.. డెస్టినీ 125ని త్వరలో విడుదల చేయనుంది. ఇప్పుడున్నమోడల్స్ కంటే మరి న్ని ఫీచర్లతో అందుబాటులో వస్తుందని అంచనా.