స్విండన్ టౌన్ సెంటర్లో ఉన్న ప్రీమియర్ ఇన్ హోటల్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అడుగులేస్తోంది. అందులో భాగంగా టౌన్‌లోని హోటల్లో రూఫ్ సోలార్ ప్యానెల్స్ పెట్టింది. ఈ ప్యానెల్స్ పెట్టకముందు గ్రిడ్ నుంచి పవర్‌ను వాడేవాళ్లు. ఈ ప్రీమియర్ హోటల్స్ గ్రూప్ యు.కె., ఐర్లాండ్‌లలో ఉన్నాయి. ఆ హోటల్స్‌లో అన్నింటిలో ఈ ఏర్పాట్లు చేయించాలనుకుంటున్న వాళ్లు ముందుగా స్విండన్ టౌన్లో ఉన్న హోటల్లో ట్రై చేశారు.
కర్బన ఉద్గారాలను తగ్గించే పనిలో భాగంగా టెస్ట్ ప్రాజెక్ట్ దీనితో మొదలుపెట్టారు. 2040 వరకు మెయిన్ గ్యాస్ కనెక్షన్‌ను తీసేయడమే మా లక్ష్యం అంటోంది ఈ హోటల్ గ్రూప్. ఈ హోటల్లో తక్కువ విద్యుత్ వాడే లెడ్ లైటింగ్‌తో పాటు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా విడుదలయ్యే హీట్‌ను తిరిగి వాడుతున్నారు. అలాగే గాలికోసం వాడే హీట్ పంప్స్ ద్వారా హోటల్ బిల్డింగ్‌లో అన్ని సీజన్లలో అనుకూలంగా ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేస్తున్నారు.
‘‘యు.కె.లో మొదటి ఎలక్ట్రిక్ బడ్జెట్ హోటల్ మాది. దాన్ని స్థిరంగా, అందుబాటులో ఉండేలా చేస్తున్నాం” అని ఈ హోటల్స్ కన్స్ట్రక్షన్ హెడ్ రిచర్డ్ అల్డ్రెడ్ చెప్పాడు.
‘‘ఈ హోటల్లో ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ డిజైన్స్ చూస్తే రద్దీగా ఉండే టౌన్ సెంటర్ లొకేషన్లలో కూడా అనుకున్నట్టు ఎలా చేయొచ్చో తెలుస్తుంది. ఈ హోటల్లోని సూట్, లో కార్బన్ డిజైన్‌ను యు.కె., ఐర్లాండ్‌లో ఉన్న టౌన్ సెంటర్లలో కూడా వాడతాం” అన్నాడు స్విండన్ బోరౌ కౌన్సిల్ లీడర్ జిమ్ రాబిన్స్.