చెన్నై ట్విస్ట్ : వాళ్లందరూ వడదెబ్బకు.. గుండెపోటుతో చనిపోయారు..!

చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆదివారం ( అక్టోబర్ 6, 2024 ) జరిగిన IAF ఎయిర్ షో చోటు చేసుకున్న విషాదం గురించి గురించి తెలిసిందే. ఎయిర్ షోలో ఉద్రిక్తతకు దారి తీసిన తొక్కిసలాటలో 5 మంది మృతి చెందారు. దీంతో ఎయిర్ షో నిర్వహణలో తమిళనాడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఘటనపై వివరణ ఇచ్చింది డీఎంకే సర్కార్. తొక్కిసలాట, నిర్వహణలోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన చాలామంది డిశ్చార్జి అయ్యారని.. చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని డీఎంకే నేత శరవణన్ అన్నాదురై వెల్లడించారు.

భారీగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని... ఆదివారం సుమారు 15 లక్షల మంది ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చారని తెలుస్తోంది. సుమారు 14 నుండి15 కిలోమీటర్ల మేర జనసందోహంతో తీర ప్రాంతం కిక్కిరిసిపోయింది. షో స్టార్ట్ అవ్వక ముందే..  చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

Also Read : హర్యానాలో ఒక్కసారిగా మారిన ట్రెండ్

షో పూర్తయ్యాక, ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొనడం... బీచ్ రోడ్డులో నీటివసతి లేకపోవడం.. ఎండ తీవ్రత పెరగడం వెరసి.. బాధితుల సంఖ్య పెరిగింది. ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించుకునేందుకు పలువురు సబర్బన్, మెట్రో రైళ్లను ఆశ్రయించగా.. ఆ స్టేషన్లలోనూ భారీగా తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది.