ఓటర్ ఎన్​రోల్​​మెంట్ కు కృషిచేయాలి

సుల్తానాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్స్ ను ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్సీ ఓటర్లుగా ఎన్​రోల్​మెంట్​ చేయించేందుకు తన మద్దతుదారులు కృషి చేయాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ హైస్కూల్ ఆవరణలో సోమవారం గ్రాడ్యుయేట్స్ కు ఎన్​రోల్​మెంట్​ పత్రాలను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో జరగబోయే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి  తాను పోటీచేస్తున్నానన్నారు.  మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు.