స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ పోటీలకు ఎంపిక

కరీంనగర్ టౌన్,వెలుగు: అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్  పోటీలకు ఎంపికైనట్లు చైర్మన్ నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. గురువారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను చైర్మన్ అభినందించారు.

ఆయన  జూన్ 24న స్థానిక కరీంనగర్ క్లబ్ లో  నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కె.హర్షిత్, పి.ప్రసన్నకుమార్ పాల్గొని  ఫస్ట్ ప్లేస్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో జాతీయస్థాయికి ఎంపిక  కావాలని ఆకాంక్షించారు. 

ALSO Read : భూసేకరణ పనులు స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయండి : కోయ శ్రీ హర్ష