మిస్డ్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌తో ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి

  • అల్ఫోర్స్ చైర్మన్  నరేందర్ రెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు: మిస్డ్​కాల్‌‌‌‌‌‌‌‌తో కరీంనగర్, ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నమోదు చేసుకోవాలని అల్ఫోర్స్  చైర్మన్  ఊట్కూరి  నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు.  బుధవారం స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ సెంట్రల్ ఆఫీస్ లో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మిస్డ్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌ క్యాంపెయిన్  పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో  కేవలం 1.97లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ప్రస్తుతం  4లక్షల  మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదుచేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఓటరు నమోదు కోసం 50  మంది  సిబ్బందిని  ఏర్పాటు చేశామన్నారు. 9240021444 నంబర్ కు మిస్డ్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కాలేజీల పెండింగ్‌‌‌‌‌‌‌‌ రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బకాయిల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా ఏ పార్టీ టికెట్ రాకున్నా, ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గానైనా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. 

విద్యార్థులకు అభినందన

కొత్తపల్లి, వెలుగు: ఎస్జీఎఫ్​ రాష్ట్ర స్థాయి ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పోటీలకు అల్ఫోర్స్​ విద్యార్థులు ఎంపికైనట్లు చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో సత్తాచాటి ఎంపికైన ఎస్.అశ్వత్, ఖాజా మోహినుద్దీన్ అహ్మద్, కె.రిషి, సహస్ర, అనన్యలను బుధవారం ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, పీఈటీలు పాల్గొన్నారు.