దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా

చిన్న పిలగాళ్ల నుంచి పండు ముసలోళ్ల దాకా అందరికీ సెలబ్రేషన్ కావాల్సిందే. లైఫ్ అన్నంక ఎవరి లెవెల్లో వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అయితే, తాగి పడిపోవడం ఏం సెలబ్రేషన్? దాంట్లో ఏం ఆనందం ఉంది? 'లిక్కర్ లేకుంటే సెలబ్రేషనే కాదు' అన్నట్టు ఇయ్యాల దావత్ కి అర్థం మారిపోయింది. 'దావత్ వితవుట్ దారు' అనేదే ఉండదా?

ఒక ఊళ్లో పెండ్లి అయితుంది. దోస్తులంతా కలిసి పెండ్లి కొడుకుని దావత్ అడిగినరు. ఐదు వేలు తీసిచ్చి.. 'తాగు పోండ్రి.. ఎంజాయ్!" అని చెప్పిండు. అందులో ఒక దోస్తు.. 'నాకు అలవాటు లేదు' అన్నడు. తాగకుంటే ఏమన్నా మంచోనివారా?.. ఏం మనిషివి రా బయ్' అని వాడిని చిన్న చూపు చూసినరు. తర్వాత పుల్లుగా తాగి బరాత్ల మస్తు డ్యాన్స్ చేసినరు. అదే ఊళ్లో ఒకాయన సచ్చిపోయిండు. ఆ ఇంట్ల అంతా ఏడుస్తున్నరు. అన్నీ అయిపోయినంక.. సుట్టాలంతా కలిసి వాళ్లఫ్యామిలీకి తాపించినరు. బాధ మర్చిపోవాలని, జాబ్ వచ్చిన, ఇంక్రిమెంట్ వచ్చిన, పెండ్లి, పండుగ, పేరంటం, పుట్టినా, చచ్చినా దేనికైనా ఇదేనా? 'అసలు మన సంస్కృతిల మందెక్కడిది?

తాగితినే దోస్తువురా..

'తాగురా భయ్.. తాగితేనే నువ్వు మా దోస్తు అనేటోళ్లంతా నిజమైన దోస్తులు కాదు. 'తాగను' అని చెప్పినప్పుడు వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించినోళ్లే అసలు దోస్తులు. కొంతమంది 'ఇగ తాగుడు బంద్ చేద్దాం' అని అనుకుంటరు. వారం, పది రోజుల తర్వాత దోస్తులు, చుట్టాలు తాగు.. తాగు' అని నరకం చూపిస్తరు. 'ఒక్క పెగ్గు తాగితే ఏమైతదిరా? నాకు కంపెనీ ఇయ్యవా?' అని టెంప్ట్ చేస్తరు. 'ఈ రోజు తాగకుంటే.. నువ్వు వేస్ట్... కటీఫ్ భయ్' అని కూడా భయపెడ్తరు.

అలవాటు లేకుంటే...

ఇగ అసలు తాగుడు అలవాటు లేనోన్ని అయితే పురుగు లెక్క చూస్తరు. 'ఎప్పుడు చస్తామో తెల్వదు రా భయ్.. ఎంజాయ్ చెయ్యాలే' అంటూ వాణ్ని వెలేస్తరు. దీంతో తాగనోళ్లు అభద్రతా భావానికి గురైతున్న పరిస్థితి. నిజానికి 'నువ్వు మంచి పని చేస్తున్నవ్. డబ్బులు సేవ్ చేస్తున్నవు' అని మెచ్చుకోవాలె. 'తాగకుంటేనే ఆరోగ్యం మంచిగుంటది... నేను కూడా నిన్ను ఫాలో అయితా' అని చెప్పి ఫాలో కావాలె. తాగుడే ఘన కార్యమన్నట్టు.. తాగకుంటే నేరం చేసినట్టు తాగనోళ్లను డిస్కరేజ్ చేస్తున్నరు.

పల్లెల నిండా..

తెలంగాణ పల్లెల్లో గ్రామదేవతలు ఎక్కువ. బొడ్రాయి, ఎల్లమ్మ, మల్లన్న, దుర్గమ్మ, పోచమ్మ ఇట్ల ఏడాదికి ఏదో ఒక పండుగ అయితది. ఏ పండుగైనా దావత్ ఉంటది. 'ఊరంతా పండుగ.. మనం ఒక్కళ్లం చెయ్యకుంటే ఎట్ల? పైసలు లేకున్న అప్పు చేసి మరి పండుగలు చేస్తున్నరు. తిండి కన్నా ఎక్కువ మందుకు ఖర్చు పెడుతున్నరు. దావతికి పోయొస్తే.. కడుపు నిండా పెట్టినరా?' అని అడిగేటోళ్లు, ఇప్పుడు 'సుక్క నిండుగా పోసినరా' అని అడుగుతున్నరు. ఒకవేళ తాగుడు పెట్టకుంటే.. ఆ ఊరి డబ్బకాడా తాగొచ్చి సుట్టం ఇంటికాన్నే గౌడవ చేస్తరు. దావత్ అంటే మంచిగా తినాలె. చుట్టాలంతా కలిసి.. ఆడాలె. పాడాలె. అదే కదా నిజమైన దావత్.

ఫెయిల్యూర్కి మందే..

సక్సెస్లు, సంతోషాలు వస్తే మందే. ప్రేమ లేదా రిలేషన్షిప్ ఫెయిల్ అయింది. అప్పులు పెరిగినయ్. రోగం వచ్చింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.. ఇయ్యన్నింటికీ మందే మందంటరు తాగేటోళ్లు. ఆ బాధలు సమస్యల వల్ల వచ్చినయ్. ఆసమస్యలకు మందు ఎట్లపరిష్కారం అయితది? సమస్యలుఎట్ల పోతయ్ తాగితే? సమస్యలుఎదుర్కొవడానికి కానీ.. తాగి మర్చిపోవడానికి కాదు కదా!

కొన్ని సినిమాల్లో హీరోల్లా తాగి.. సీసాలు పగలగొట్టడం, ఫైటింగ్ చెయ్యడం అస్సలు కాదు. నిజమైన దావత్ లేకపోవడం.