కేరళలో హైఅలర్ట్: పెరుగుతున్న H1N1 కేసులు

కేరళలో జర్వాలు కలవర పెడుతున్నాయి. గతకొద్ది రోజులుగా వెస్ట్ నైలు జర్వం విజృభిస్తుండగా తాజాగా.. మరోపక్క మాయదారి రోగం H1N1 కేసులు పెరిగిపోతున్నాయి.అలప్పుజ జిల్లాలో  ఈ ఏడాదిలో H1N1 కేసులు ఇప్పటి వరకు 35 నమోదు కాగా,, ఏప్రిల్, మే నెలల్లో తొమ్మిది కేసులు వెలుగు చూశాయి. దీంతో అలప్పుజ జిల్లా ప్రజలు భయాందోళలనకు గురవ్వుతున్నారు. జిల్లా వైద్యాధికారి అలర్ట్ జారీ చేశారు. 

H1N1 గాలి, శరీర ద్రవాల ద్వారా వ్యాపించే అంటువ్యాధి. ప్రజలు బహిరంగంగా, రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ఆసుపత్రి సందర్శనల సమయంలో మాసు ధరించాలని సూచించారు. వ్యాధి సోకిన వారు తమను తాము ఒంటరిగా ఉంచుకోవాలని ఇతరులతో కలవకూడదు. షుగర్, ప్రెషర్, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో సహా గర్భిణీలు మరియు వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో H1N1 పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉంటాయి. జ్వరం, జలుబు, బాడీ పెయిన్ వంటి లక్షణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీయ మందులను ఆశ్రయించకూడదని డీఎంవో తెలిపారు.