పంటలకు మద్దతు ధర లభించేలా చట్టం తేవాలి : ఆకుల పాపయ్య

డిచ్​పల్లి, వెలుగు: రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్​చేశారు. సంయుక్త కిసాన్​ మోర్చా దేశవ్యాప్త గ్రామీణ బంద్​ కు ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం మెంట్రాజ్​పల్లి వద్ద ఎన్​హెచ్​44 పై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్​ సవరణ బిల్లును కేంద్ర వెనక్కి తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులపై టియర్​గ్యాస్​ ప్రయోగం సరికాదన్నారు. లీడర్లు సాయిరెడ్డి, దేవస్వామి, కృష్ణాగౌడ్, సాయినాథ్, రాజేశ్వర్, నగేశ్, రవీందర్ ​పాల్గొన్నారు.