ఆర్కే స్మారకస్తూపం కూల్చివేత

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా తెర్రెం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలోని కోమటిపల్లి అడవుల్లో ఉన్న మావోయిస్ట్‌‌‌‌ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌‌‌‌ అలియాస్‌‌‌‌ ఆర్కే స్మారక స్తూపాన్ని సోమవారం భద్రతాబలగాలు కూల్చివేశాయి. ఆర్కే స్మారకార్థం మావోయిస్టులు కోమటిపల్లి అడవుల్లో 62 అడుగుల ఎత్తైన స్తూపాన్ని నిర్మించి, చుట్టూ కంచెలను ఏర్పాటు చేశారు. ఈ స్తూపం అడవిలో సుమారు కిలోమీటర్‌‌‌‌ దూరం వరకు కూడా కనిపిస్తుంది.

మావోయిస్టులపై పైచేయి సాధించే క్రమంలో భద్రతాబలగాలు దండకారణ్యంలో ఉన్న స్తూపాలను పడగొడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెర్రెం బేస్‌‌‌‌ క్యాంపు నుంచి డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ బలగాలు కోమటిపల్లిలోని ఆర్‌‌‌‌కే స్తూపం వద్దకు చేరుకున్నారు. తర్వాత మందుపాతరలు ఏర్పాటు చేసి స్తూపాన్ని కూల్చివేశారు.