రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బకాయిలు వెంటనే రిలీజ్‌‌‌‌ చేయాలి

  • కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌ ఎదుట ఏఐఎస్‌‌‌‌ఎఫ్​ధర్నా 

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌, స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఏఐఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు కె.మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో బకాయిలు విడుదల చేయకపోతే 27న చలో ఇందిరాపార్క్ నిర్వహిస్తామన్నారు. వేలాది మంది స్టూడెంట్లతో అసెంబ్లీ  ముట్టడిస్తామని  హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి వెంకటేశ్‌‌‌‌, లీడర్లు రమేశ్‌‌‌‌, హేమంత్, రాము, సాగర్, విష్ణు పాల్గొన్నారు.