Airtel Prepaid: ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్..రోజుకు 2GB డేటా..బెనిఫిట్స్ ఎన్నో

ఎయిర్టెల్..ప్రముఖ ప్రయివేట్ టెలికాం ఆపరేటర్.. ఇటీవల తన రీచార్జ్ ప్లాన్ల ధరలు పెంచింది..దీంతో కస్టమర్లు బీఎస్ ఎన్ ఎల్ వైపు మళ్లుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఎయిర్ టెల్ కొత్త కొత్త రీచార్జ్ ఆఫర్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 398 లు. 

తాజా 2024 ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ రోజుకు 2GB డేటాతోపాటు హాట్స్టార్ మొబైల్కు 28 రోజుల సబ్ స్క్రిప్షన్ను అందిస్తుంది. ఇది లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లకు యాక్సెస్ ఉంటుంది. హాట్ స్టార్ మొబైల్ ప్లాన్ ఒక డివైజ్కు  మాత్రమే వర్తిస్తుంది.

ఈ కొత్త ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత లోకల్, STD ,రోమింగ్ కాల్స్, రోజుకు 2GB 5G డేటా , ప్రతిరోజూ 100 SMSలను అందిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

ALSO READ | Realme 14x 5G: రూ.15వేలకే కొత్త స్మార్ట్ ఫోన్..డిసెంబర్18న లాంచింగ్..బెస్ట్ బ్యాటరీ

మరోవైపు జియో కూడా తన న్యూఇయర్ వెల్ కమ్ ప్లాన్ ను రూ. 2025ధరతో ప్రారంభించింది. ఈ ప్లాన 200 రోజులు వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, మొత్తం 500GB హైస్పీడ్ 4G డేటా ను అందిస్తుంది. 

ఇది JioTV , JioCinema వంటి JioSuite యాప్‌లకు అపరిమిత SMS ,కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 11, 2024 , జనవరి 11, 2025 మధ్య MyJio యాప్ ,Jio వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.