Airtel Data Plan : రోజుకు 7 రూపాయలకే.. 1 GB అంట..! ఎయిర్‌టెల్ మూడు న్యూ రీఛార్జ్ ప్లాన్స్

డేటా వాడకం పెరిగిపోతుండటంతో టెలికం కంపెనీలు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకొస్తున్నారు. కొన్ని నెలల క్రితం అన్ని నెట్ వర్క్ ల టారీఫ్ ఛార్జీలు 12 నుంచి 24 శాతం పెంచేశాయి. దీంతో మొబైల్ యూజర్లపై భారం పడి.. గవర్నమెంట్ నెట్ వర్క్ లాంటి బీఎస్ఎన్ఎల్ కు మారిపోతున్నారు.  ఈ క్రమంలోనే వీఐ, జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు మొబైల్ యూజర్లకు రిలీఫ్ కలిగించే విధంగా కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకువస్తున్నారు. ఎయిర్‌టెల్ మూడు న్యూ డేటా రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేసింది. వీటి టైం లిమిట్ నెల రోజులు.. ఛార్జీ వివరాలు, ఎంత జీబీ డేటా వస్తుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ALSO READ | Spam Calls:హాయిగా ఉంటుంది:ఇక నుంచి మార్కెటింగ్ ఫోన్స్కాల్స్ ఉండవు

ఎయిర్‌టెల్ నెట్ వర్క్ వాడుతున్న వారికి  వారు రూ.161, రూ.181 మరియు రూ.361 మూడు కొత్త రిఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు ప్యాకేజీ వాలిడిటీ 30 రోజులు వరకు ఉంటుంది.

ఎయిర్‌టెల్ కొత్త డేటా రీఛార్జ్ ప్లాన్‌లు

రూ.161 ప్లాన్ డైలీ లిమిట్ లేకుండా 30 రోజుల పాటు 12GB డేటాను అందిస్తుంది, యూజర్లకు ఒక్కో GBకి రూ.13 ఖర్చవుతుంది. 
రూ.181 ప్లాన్ డైలీ లిమిట్ లేకుండా 30 రోజుల పాటు 15GB డేటాను పొందవచ్చు. ఒక్కో GBకి రూ.12. 
రూ. 361 ప్లాన్‌లో డైలీ లిమిట్ లేకుండా 30 రోజుల పాటు 50GB డేటా వాడుకోవచ్చు. ఒక్కో GBకి దాదాపు రూ. 7 ఖర్చవుతుంది.