వాయు కాలుష్యంతో గొంతు నొప్పి, దగ్గు వస్తుందా.. ఈ హోమ్ రెమిడీస్ మీ కోసమే

ఢిల్లీ, ముంబైలలో వాయు కాలుష్యం దారుణంగా పెరిగిపోతోంది. ఇటువంటి విషపూరితమైన గాలి కారణంగా, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది రాబోయే కాలంలో మరింత తీవ్రమవుతోంది. గాలి నాణ్యతలో మార్పులు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అటువంటి చెడు గాలితో, గొంతు నొప్పి సమస్య కూడా ప్రారంభమవుతుంది. ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది. మీరు కూడా గొంతు నొప్పితో బాధపడుతున్నట్టయితే అందుకు.. ఇంటి నివారణల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు. ఇంట్లో వీటిని ప్రయత్నించండి, వాయు కాలుష్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.  

అల్లం

గొంతు నొప్పికి ఆయుర్వేద టీ చాలా ఎఫెక్టివ్ రెమెడీ. తులసి, లవంగాలు, నల్ల మిరియాలు, అల్లం కలిపి టీ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, ఇతర గొంతు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి స్వభావం కలిగిన వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు తీసుకోవడం అనేది గొంతు నొప్పి విషయంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బటాషా లోపల ఎండుమిర్చి ఉంచి నమలండి. అంతే కాకుండా ఎండుమిర్చి, పంచదార మిఠాయిని కూడా నమిలి తినవచ్చు. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

వెల్లుల్లి

మీకు గొంతు నొప్పి ఉంటే, వెల్లుల్లి రెబ్బలను కూడా నమలవచ్చు. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లి రెబ్బను నోటిలో ఉంచి పీల్చడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

వేడి నీటితో ఆవిరి

గొంతు నొప్పి విషయంలో, గోరువెచ్చని నీటితో పుక్కిలించడం మంచిది. మీరు గోరువెచ్చని నీటిలో ఉప్పును కూడా జోడించవచ్చు. గోరువెచ్చని నీళ్లతో ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల గొంతుకు, నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటి నుండి ఆవిరి తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

పసుపు పాలు

పాలు, పసుపు కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఇప్పటికే వినే ఉంటారు. ఇది జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అందుకే దీనిని బంగారు పాలు అని కూడా అంటారు. పసుపు కలిపిన పాలు తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

మేథి

గొంతు నొప్పికి మెంతులు చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చికాకు కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. మీరు దీన్నిటీ గానూ తాగవచ్చు. గొంతు నొప్పికి చికిత్స చేయడానికి స్వీట్ లైకోరైస్ రూట్ శతాబ్దాలుగా ఉపయోగించబడింది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా దీని రూట్‌ను నీటిలో కలపండి, ఆపై దానితో పుక్కిలించండి.